ఇటీవల మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “టీ (Tea)” యాప్ బాగా వైరల్ అయింది. పురుషుల గురించి ఆడవాళ్లు తమ అనుభవాలు, జాగ్రత్తలు చెప్పుకునే ప్లాట్‌ఫారంగా ఇది వేగంగా టాప్‌చార్ట్‌కి చేరింది. కానీ ఇప్పుడు, హ్యాకర్లు ఈ యాప్‌ను బద్దలుకొట్టి 13,000 ఫోటోలు, ప్రభుత్వ-issued ఐడీలు లీక్ చేశారు
ఏమి జరిగింది?
తాజాగా Tea యాప్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు, దాదాపు 72,000 ఫోటోలు చోరీ చేశారు. వీటిలో 13,000 సెల్ఫీలు, ఆధారంగా పంపిన ఐడీ కార్డులు ఉన్నాయి. ఈ సమాచారం 4Chan అనే రైట్-వింగ్ ఫోరమ్‌లో హ్యాకర్ల కాల్-టు-యాక్షన్ తర్వాత లీక్ అయిందని తెలుస్తోంది.
Tea యాప్ గురించి:
- ఇది ఒక వర్చువల్ “విస్పర్ నెట్‌వర్క్”, అంటే మహిళలు పురుషులపై తమ అనుభవాలు పంచుకునే ప్లాట్‌ఫారమ్.
- పురుషుల పేరుతో సెర్చ్ చేయవచ్చు, వారిపై రివ్యూలు, “రెడ్ ఫ్లాగ్” లేదా “గ్రీన్ ఫ్లాగ్” అనిపిస్తే కామెంట్లు పెట్టొచ్చు.
- అకౌంట్ క్రియేట్ చేసేందుకు మహిళలు సెల్ఫీలు, ఐడీ ఫోటోలు అప్‌లోడ్ చేయాలి. యాప్ వాటిని సమీక్ష తర్వాత డిలీట్ చేస్తుందని చెబుతుంది.
- స్క్రీన్‌షాట్ తీసే అవకాశాన్ని కూడా అడ్డుకుంటుంది.
ఇటీవల ఇది Apple App Store లో టాప్ ఫ్రీ యాప్‌గా మారింది – ఒక్కరోజులోనే దాదాపు మిలియన్ సైన్‌అప్స్ వచ్చాయి.
హ్యాక్ ఎలా జరిగింది?
Tea ప్రతినిధి ప్రకారం, ఈ హ్యాకింగ్‌లో 2 ఏళ్ల క్రితం తీసిన డేటాబేస్‌ను టార్గెట్ చేశారు. ఆ డేటా సైబర్ బుల్లీయింగ్‌పై కేసుల్లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం స్టోర్ చేశామని చెప్పారు. ఇప్పుడు, ఆ డేటా 4Chan, X (Twitter) వంటి ఫోరమ్లలో లీక్ అయింది.
Tea యాప్ స్పందన:
- “మా యూజర్ల ప్రైవసీ మా టాప్ ప్రాధాన్యత,” అని spokesperon చెప్పారు.
- ఇప్పుడు మేము సైబర్‌సెక్యూరిటీ నిపుణులను హైర్చేసి 24/7 పని చేస్తున్నామన్నారు.
- కొత్తగా 2 మిలియన్లకు పైగా సైన్‌అప్స్ వచ్చాయని Tea Instagram స్టోరీలో తెలిపింది.
Google Mapsలో కూడా లీక్?
ఒక యూజర్ Tea హ్యాక్ బాధితుల లొకేషన్లను చూపిస్తూ గూగుల్ మ్యాప్ తయారు చేశారు. అయితే, ఇందులో పేర్లు, అడ్రెస్సులు లేవు – కేవలం కోఆర్డినేట్స్ మాత్రమే ఉన్నాయి.
యాప్ సృష్టికర్త ఎలా స్ఫూర్తి పొందారు?
Tea యాప్‌ను షాన్ కుక్ అనే వ్యక్తి రూపొందించారు. ఆయన తల్లి ఒకసారి ఆన్‌లైన్ డేటింగ్‌లో తీవ్ర అనుభవాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. అప్పటి నుంచి మహిళల భద్రత కోసం యాప్ తయారు చేయాలనుకున్నారు.
ఈ యాప్ ద్వారా మహిళలు:
- పురుషుల బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయవచ్చు.
- క్రిమినల్ రికార్డులు, ఫేక్ ఐడీ కేసులు చెక్ చేయవచ్చు.
- ఫోటోలను రివర్స్ సెర్చ్ చేసి కెట్‌ఫిషింగ్ నుంచి తప్పించుకోవచ్చు.
గాయపడినవాళ్లు – కౌంటర్ రియాక్షన్స్:
- కొంతమంది మగవాళ్లు ఈ యాప్‌ను మగవాళ్లపై అన్యాయం చేస్తుందని, డాక్సింగ్‌కి దారితీస్తుందనేది చెబుతున్నారు.
- వాళ్లు కూడా తమకో ప్రత్యేక “Tea for Men” యాప్ తయారు చేయాలని భావించారు.
- “Teaborn” అనే యాప్ రూపొందించబడింది కానీ త్వరలోనే రెవెంజ్ పోర్న్ పోస్టింగ్ కారణంగా దాన్ని అప్ స్టోర్ నుంచి తొలగించారు.