ఐదేళ్లుగా Xbox కొత్త కన్సోల్ హార్డ్‌వేర్ ఏమాత్రం విడుదల కాలేదు. కానీ ఈసారి మైక్రోసాఫ్ట్ కాదండీ… Asus తయారు చేస్తున్న Xbox బ్రాండెడ్ హ్యాండ్‌హెల్డ్ డివైస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది Xbox కంట్రోలర్‌ను రెండు భాగాలుగా విడగొట్టి, మధ్యలో స్క్రీన్ జోడించినట్టే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ తమ స్వంత హ్యాండ్‌హెల్డ్ పీసీని వాయిదా వేసిన నేపథ్యంలో, Asus వంటి హార్డ్‌వేర్ పార్ట్‌నర్లపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ దీని విజయాన్ని ఖచ్చితంగా చూడాలంటే, అది ప్రజలకు అభికమయ్యే

Source: Xbox
ఐదేళ్లుగా Xbox కొత్త కన్సోల్ హార్డ్‌వేర్ ఏమాత్రం విడుదల కాలేదు. కానీ ఈసారి మైక్రోసాఫ్ట్ కాదండీ… Asus తయారు చేస్తున్న Xbox బ్రాండెడ్ హ్యాండ్‌హెల్డ్ డివైస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది Xbox కంట్రోలర్‌ను రెండు భాగాలుగా విడగొట్టి, మధ్యలో స్క్రీన్ జోడించినట్టే ఉంటుంది.
మైక్రోసాఫ్ట్ తమ స్వంత హ్యాండ్‌హెల్డ్ పీసీని వాయిదా వేసిన నేపథ్యంలో, Asus వంటి హార్డ్‌వేర్ పార్ట్‌నర్లపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ దీని విజయాన్ని ఖచ్చితంగా చూడాలంటే, అది ప్రజలకు అభికమయ్యే ధరలో ఉండాలి
లీకైన ధరలతో షాక్:
- Xbox Ally (Ryzen Z2A చిప్‌తో): 600 యూరోలు (~₹55,000)
- Xbox Ally X (Z2 Extreme APUతో): 900 యూరోలు (~₹82,000)
అమెరికాలో అయితే $700 (అలీ) నుంచి $1,050 (అలీ X) వరకూ ధర ఉండొచ్చు. కానీ ట్రంప్ అమలు చేసిన టారిఫ్‌ల వల్ల అమెరికన్లు ఎక్కువగా చెల్లించే అవకాశం ఉంది.
ధరల గురించి గందరగోళం ఎందుకంటే…
ఈ ధరలు అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. అవి కొన్ని స్టోర్‌ల్లో గూగుల్‌లో లీకైన లిస్టింగ్స్ ఆధారంగా లెక్కించబడినవి. అయితే, Asus గతంలో 1TB ROG అలీ X ధరను $800 నుంచి $900కు పెంచిన సంగతి గుర్తుంచుకోవాలి.
ఈ లీకుల వల్ల Xbox బ్రాండెడ్ హ్యాండ్‌హెల్డ్ పీసీని ప్రజలు వాస్తవంగా కొనగలరా అనే సందేహం కలుగుతుంది.
మార్కెట్‌లో పరిస్థితి:
- Steam Deck (LCD) – ఇప్పటికీ బడ్జెట్‌కి బెస్ట్ ఆప్షన్
- Steam Deck (OLED) – $550
- Lenovo Legion Go S (SteamOS) – $600
- Legion Go S (Windows + Z2 Go chip) – $730
మొత్తంగా చూస్తే, Windows ఆధారిత డివైస్‌లు SteamOS కన్నా ఖరీదైనవే. Windows లైసెన్స్ ఖర్చు కారణంగా ధర పెరుగుతోంది.
అందుకే Asus Xbox డివైస్ కూడా Steam Deck కంటే ఖరీదయితే… ప్రజలు ఎందుకు Xboxకి మొగ్గు చూపుతారు?
Xbox డివైస్ ప్రత్యేకతలు:
- Xbox యాప్‌తో Windows స్పెషల్ వర్షన్
- Steam, Epic Games Store వంటి ఇతర లాంచర్‌లకు యాక్సెస్
- Xbox Game Pass కి పూర్తి సపోర్ట్
- Thunderbolt 4 USB-C పోర్ట్
- DisplayPort 2.1 – TV & మానిటర్‌తో సులభ కనెక్షన్
- Asus eGPU కి కూడా సపోర్ట్ ఉండొచ్చు (పెద్ద గేమ్స్‌కు అదనపు గ్రాఫిక్స్ శక్తి)
కానీ, SteamOS మాదిరిగా అనుకూలత, కస్టమైజేషన్ Xbox డివైస్‌లో ఉండబోతుందా? ఇంకా స్పష్టత లేదు. Valve Steam Deck కోసం పెద్ద డెవలపర్ కమ్యూనిటీ ఉంది. అదే Windows పీసీకి వస్తే… మరిన్ని అప్లికేషన్లు, అధిక ఫీచర్లు వాడుకునే ఛాన్స్ ఉంటుంది.
సమస్య ఎక్కడంటే…
Steam Deck కన్నా Xbox Ally ఖరీదైతే, మరి ప్రజలు దాన్ని ఎందుకు కొనాలి?
మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగం ఇప్పటికే మందగమనంలో ఉంది.
ఈ డివైస్ Xbox బ్రాండ్‌కు ఊపునిచ్చే అవకాశమే ఉంది – కానీ అది ధర మీద ఆధారపడి ఉంటుంది!
Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *