శుక్రవారం బిట్‌కాయిన్ కొంత అస్థిరత చూపినా, అల్ట్‌కాయిన్స్ మిలమిలలాడాయి. అమెరికా కాంగ్రెస్‌లో క్రిప్టో కరెన్సీలకు మద్దతుగా GENIUS చట్టం ఆమోదం పొందడంతో క్రిప్టో మార్కెట్ ఉత్సాహంగా మారింది. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో 401(k) రిటైర్మెంట్ ప్లాన్లలో క్రిప్టో పెట్టుబడులను కూడా చేర్చే అవకాశముందని ఓ నివేదిక వెల్లడించింది.
ప్రపంచపు అతిపెద్ద క్రిప్టో అయిన బిట్‌కాయిన్ శుక్రవారం తెల్లవారుఝామున కొంత స్థిరంగా ఉన్నా, పది గంటల వ్యవధిలో దాని విలువ కొంచెం తగ్గింది. CoinDesk ప్రకారం, గత 24 గంటల్లో 0.2% లాభంతో బిట్‌కాయిన్ ధర $118,600 వద్ద ట్రేడ్ అవుతోంది, అయితే ఇది గరిష్టంగా $121,000 ని తాకింది. ఈ వారం ప్రారంభంలో అది $122,658ని కూడా చేరుకుంది.
XRP బ్లాస్ట్!
ఇంకా బాగా దూసుకెళ్తున్నది XRP. CoinDesk గణాంకాల ప్రకారం, XRP దాదాపు 5% పెరిగి $3.40కు చేరింది. కొంత సమయం పాటు ఇది $3.64 అనే ఆల్‌టైమ్ హైను కూడా చేరింది. అదే విధంగా, ఈథర్ (ETH) 4% పెరిగింది, సొలానా (SOL) 1.3% పెరిగింది.
GENIUS చట్టం & Clarity చట్టం:
అమెరికా హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ గురువారం రాత్రి GENIUS చట్టాన్ని ఆమోదించింది. ఇది స్టేబుల్‌కాయిన్లను నియంత్రించేందుకు రూపొందించబడింది. ఇది ట్రంప్ సంతకం చేసి త్వరలోనే చట్టంగా మారే అవకాశముంది.
ఇంకొక ముఖ్యమైన చట్టం – Digital Markets Clarity Act – కూడా హౌస్‌లో ఆమోదం పొందింది. ఇది క్రిప్టో కరెన్సీలు “కామోడిటీ”లు కా “సెక్యూరిటీ”లుగా పరిగణించాలా అన్న అస్పష్టతను తొలగిస్తుంది. కానీ ఈ బిల్లుకు ఇంకా సెనెట్ ఆమోదం అవసరం.
ట్రంప్ ప్లాన్ – 401(k)లో క్రిప్టోకి మార్గం:
ఇంతలో ట్రంప్ మరో శక్తివంతమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు సిద్ధమవుతున్నారు. Financial Times ప్రకారం, ఈ వారం నుంచే 401(k) రిటైర్మెంట్ ప్లాన్లలో క్రిప్టో కరెన్సీలను చేర్చేందుకు అవకాశం కల్పించే ఆదేశంపై ట్రంప్ సంతకం చేసే అవకాశం ఉంది.